Home/Movies/Epic Review: Anand Deverakonda Leads a Mixed Family Drama

ఎపిక్ మూవీ రివ్యూ: ఆనంద్ దేవరకొండకు మరో డిఫరెంట్ మూవీ

1 days ago
Updated September 11, 2026
2 min read
Epic Review: Anand Deverakonda Leads a Mixed Family Drama - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1ఆనంద్ దేవరకొండ ఆదిత్య పాత్రలో అమాయకత్వం, ఫన్ టైమింగ్‌తో ఆకట్టుకుని సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు.
  • 2శివాజీ, వాసుకిలతో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాలు బాగా వర్కవుట్ కాగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది.
  • 3ఆకట్టుకునే పాయింట్ ఉన్నప్పటికీ లీడ్ ట్రాక్‌లో క్లారిటీ లేకపోవడం, క్లైమాక్స్‌కి వెళ్లేలోపు కథ సాగదీయడం సినిమాకు ప్రధాన మైనస్‌గా మారింది.
Fact-Checked by Krihaa Editorial

వనపర్తికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ కుమారుడు ఆదిత్య. సినిమాలపై ఆసక్తితో దర్శకుడు కావాలనుకునే అతడిని చూసి తండ్రి మొదట విసిగిపోతాడు. కొడుకు భవిష్యత్తు స్థిరంగా ఉండాలనే ఉద్దేశంతో అతడిని యూకే పంపిస్తారు. చదువుతో పాటు అక్కడే సంపాదిస్తూ జీవితంలో స్థిరపడాలని కుటుంబం భావిస్తుంది. అయితే ఆదిత్య జీవితంలోకి కడలి రావడంతో అతని ఆలోచనలు, లక్ష్యాలు, వ్యక్తిగత జీవితం ఊహించని మలుపు తిరుగుతాయి. తన ఆనందాన్ని ఎంచుకోవాలా, కుటుంబం కోసం నిలబడాలా అనే ప్రశ్న చుట్టూ కథ సాగుతుంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, శివాజీ, వాసుకి కీలక పాత్రల్లో నటించారు. సినిమా ప్రారంభంలో వచ్చే కుటుంబ సన్నివేశాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. ఆదిత్య యూకే వెళ్లే వరకు కథనం చక్కటి ఫ్యామిలీ టచ్‌తో ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌కు దగ్గరగా వచ్చే కొన్ని కుటుంబ భావోద్వేగ సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. హీరోగా ఆనంద్ దేవరకొండ తన అమాయకత్వం, కామెడీ టైమింగ్‌తో ఆదిత్య పాత్రకు న్యాయం చేశాడు. వైష్ణవి చైతన్యతో అతని కెమిస్ట్రీ కూడా బాగుంది. వైష్ణవి తన పాత్రలో పెర్ఫార్మెన్స్, గ్లామర్‌ను సమతూకంగా చూపించింది. శివాజీ, వాసుకిపై వచ్చే కుటుంబ సన్నివేశాలు సినిమాకు మరో బలంగా నిలిచాయి. హేశం అబ్దుల్ వహాబ్ పాటలు, నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి.

అయితే సినిమా ప్రధాన బలహీనత ఆదిత్య, కడలి చుట్టూ నడిచే కథనమే. వీరి ట్రాక్‌లో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్న విషయంలో కొన్ని సందర్భాల్లో స్పష్టత కనిపించదు. దీంతో కథనం రొటీన్‌గా అనిపించడంతో పాటు అవసరానికి మించి సాగిన భావన కలుగుతుంది. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ప్రేక్షకులకు ముందే కలిగే సందేహానికి సమాధానం లభించినా, అక్కడికి చేరుకునే వరకు తీసుకున్న సమయం మాత్రం ఎక్కువగా అనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. యూకే లొకేషన్లను సినిమాటోగ్రాఫర్ అజీమ్ మహ్మద్ చక్కగా చిత్రీకరించారు. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం, స్కోర్ కొన్ని సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా నిలబెట్టాయి. అయితే నెమ్మదిగా సాగే సన్నివేశాలను ఎడిటర్ నవీన్ నూలి మరింత కట్ చేసి ఉంటే కథనం వేగంగా ఉండేది. దర్శకుడు ఆదిత్య హాసన్ కొన్ని ఎమోషనల్, డెప్త్ సీన్లను బాగానే డీల్ చేసినప్పటికీ, ప్రధాన పాత్రల రచనలో మరింత బలం ఉంటే సినిమా ప్రభావం పెరిగేది. మొత్తంగా ఎపిక్‌లో అక్కడక్కడా మంచి ఫ్యామిలీ మూమెంట్స్, ఎమోషన్, ఫన్, నటీనటుల మంచి పెర్ఫార్మెన్స్ కనిపిస్తాయి. కానీ లీడ్ ట్రాక్‌లోని బలహీనత, సాగదీసిన కథనం సినిమాను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే స్థాయికి తీసుకెళ్లలేకపోయాయి. క్రిహా రేటింగ్: 2.75/5.

Krihaa Media Movie Rating

EPIC

2.75/ 5

"Epic, starring Anand Deverakonda and Vaishnavi Chaitanya, is a family drama directed by Aditya Hasan. The film works in parts with its emotional family moments, humour and strong performances, especially from Anand, Vaishnavi, Shivaji and Vasuki. However, the lead pair’s track lacks clarity and the screenplay feels stretched. Krihaa.com rates Epic 2.75/5."

Verified Verdict by ApsaraKrihaa Media Review Desk
Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.