తెలంగాణకు 8 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- 1ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26 కోసం తెలంగాణ నుంచి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్ర మంత్రి జి.
- 2దీంతో బియ్యం సేకరణ లక్ష్యం 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది.
- 3ఇది సుమారు 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానమని తెలిపారు.
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26 కోసం తెలంగాణ నుంచి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. దీంతో బియ్యం సేకరణ లక్ష్యం 35 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 43 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇది సుమారు 64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి సమానమని తెలిపారు. రాష్ట్రంలో అధిక ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని జూలై 8న కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై ఈ విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.
తెలంగాణ రైతులకు మేలు చేసే ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అదనంగా కేటాయించిన సేకరణ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వినియోగించుకుని, బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు నిర్ణీత గడువులో అందించాలని ఆయన కోరారు. గత మార్కెటింగ్ సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం బియ్యం సరఫరాలో ఆలస్యం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Faster on Krihaa News App
Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.
Comments (0)
Join the conversation
Sign in to post comments, like, and reply
Published by
Krihaa News — Hyderabad, Telangana
Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.