Home/Movies/Venky Atluri Reveals the Story Behind Suriya's Next Film

సూర్య సినిమాకు ముందు జరిగిన ఆసక్తికర విషయం చెప్పిన వెంకీ అట్లూరి

Jul 24, 2026
Updated August 28, 2026
3 min read
Venky Atluri Reveals the Story Behind Suriya's Next Film - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఎలా ప్రారంభమైందో దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు.
  • 2మొదట ఆయన సూర్యకు ఒక బయోపిక్ కథ వినిపించగా, కథ నచ్చినా ఇప్పటికే రెండు బయోపిక్‌లు చేసిన కారణంగా మరోసారి అదే తరహా సినిమా చేయకూడదని సూర్య భావించారని చెప్పారు.
  • 3అందుకే మరో కథ చెప్పాలని సూచించారని వెంకీ వివరించారు.దాంతో 40 ఏళ్ల వయసున్న వ్యక్తి, 20 ఏళ్ల యువతి మధ్య ఏర్పడే భావోద్వేగ బంధాన్ని ప్రధానాంశంగా తీసుకుని వెంకీ అట్లూరి కొత్త కథను వినిపించారని తెలిపారు.
Fact-Checked by Krihaa Editorial

ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ఎలా ప్రారంభమైందో దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు. మొదట ఆయన సూర్యకు ఒక బయోపిక్ కథ వినిపించగా, కథ నచ్చినా ఇప్పటికే రెండు బయోపిక్‌లు చేసిన కారణంగా మరోసారి అదే తరహా సినిమా చేయకూడదని సూర్య భావించారని చెప్పారు. అందుకే మరో కథ చెప్పాలని సూచించారని వెంకీ వివరించారు.

దాంతో 40 ఏళ్ల వయసున్న వ్యక్తి, 20 ఏళ్ల యువతి మధ్య ఏర్పడే భావోద్వేగ బంధాన్ని ప్రధానాంశంగా తీసుకుని వెంకీ అట్లూరి కొత్త కథను వినిపించారని తెలిపారు. ఆ కథ సూర్యను వెంటనే ఆకట్టుకోవడంతో సినిమా చేయడానికి అంగీకరించారని చెప్పారు. ఈ చిత్రంలో మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.