హోమ్/సినిమా/తేజస్విని నందమూరి సినీ ఎంట్రీపై భారీ చర్చ
సినిమాRead in English

తేజస్విని నందమూరి సినీ ఎంట్రీపై భారీ చర్చ

Aug 1, 2026
Updated August 28, 2026
2 min read
Tejaswini Nandamuri's Acting Debut Sparks Buzz - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
  • 2సినీ వర్గాల సమాచారం ప్రకారం, బలమైన సామాజిక సందేశంతో పాటు క్రీడా నేపథ్యాన్ని కలిగిన ఫీమేల్ సెంట్రిక్ స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఆమె వెండితెరకు పరిచయం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
  • 3ఈ వార్త నిజమైతే నందమూరి కుటుంబం నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే తొలి నటిగా తేజస్విని నిలవనున్నారు.ఇప్పటికే నిర్మాతగా పలు సినిమాల నిర్మాణం, ప్రచార కార్యక్రమాల్లో తన ప్రతిభను చాటుకున్న తేజస్విని ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణం ప్రారంభించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Fact-Checked by Krihaa Editorial

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నందమూరి తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా అరంగేట్రం చేయనున్నారనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, బలమైన సామాజిక సందేశంతో పాటు క్రీడా నేపథ్యాన్ని కలిగిన ఫీమేల్ సెంట్రిక్ స్పోర్ట్స్ డ్రామా ద్వారా ఆమె వెండితెరకు పరిచయం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమైతే నందమూరి కుటుంబం నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే తొలి నటిగా తేజస్విని నిలవనున్నారు.

ఇప్పటికే నిర్మాతగా పలు సినిమాల నిర్మాణం, ప్రచార కార్యక్రమాల్లో తన ప్రతిభను చాటుకున్న తేజస్విని ఇప్పుడు నటిగా కొత్త ప్రయాణం ప్రారంభించనున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. కథలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యం, బలమైన కంటెంట్ కారణంగానే ఆమె ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సినిమా, ఆమె ఎంట్రీపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

ప్రచురణ

క్రిహా న్యూస్ — హైదరాబాద్, తెలంగాణ

క్రిహా న్యూస్ ఖచ్చితమైన, స్వతంత్ర వార్తా విశ్లేషణకు కట్టుబడి ఉంది. మా ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ మరియు సవరణల విధానం చూడండి.

ప్రాయోజిత సమాచారం / Sponsored