హోమ్/సినిమా/రవితేజ ‘ఇరుముడి’ నుంచి రెండో పాటకు విడుదల తేదీ ఫిక్స్
సినిమాRead in English

రవితేజ ‘ఇరుముడి’ నుంచి రెండో పాటకు విడుదల తేదీ ఫిక్స్

Aug 1, 2026
Updated August 28, 2026
3 min read
Ravi Teja’s Irumudi Unveils Second Single Release Date - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.
  • 2మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌లో సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
  • 3అయ్యప్ప దీక్ష నేపథ్యంలో తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఈ చిత్రం ఆవిష్కరించనున్నట్లు సమాచారం.సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ రెండో పాట ‘ఎలాలోయాలలో మనసుతన్నల’ను ఆగస్టు 3 ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Fact-Checked by Krihaa Editorial

మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌లో సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయ్యప్ప దీక్ష నేపథ్యంలో తండ్రీ–కూతుళ్ల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఈ చిత్రం ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ రెండో పాట ‘ఎలాలోయాలలో మనసుతన్నల’ను ఆగస్టు 3 ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన కలర్‌ఫుల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. పోస్టర్‌లో రవితేజ తన భార్య, కుమార్తెతో కలిసి అరటి పండ్ల బండిపై ప్రయాణిస్తూ కనిపించడం కుటుంబ అనుబంధాన్ని అందంగా ప్రతిబింబిస్తోంది. ఆగస్టు 21న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

ప్రచురణ

క్రిహా న్యూస్ — హైదరాబాద్, తెలంగాణ

క్రిహా న్యూస్ ఖచ్చితమైన, స్వతంత్ర వార్తా విశ్లేషణకు కట్టుబడి ఉంది. మా ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ మరియు సవరణల విధానం చూడండి.

ప్రాయోజిత సమాచారం / Sponsored