హోమ్/జనరల్/భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
జనరల్Read in English

భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Aug 1, 2026
Updated August 29, 2026
3 min read
PM Modi Inaugurates Bhogapuram Airport - General News | Krihaa
Size:
Key Highlights
  • 1ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి దేశానికి అంకితం చేశారు.
  • 2అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
  • 3ప్రధాని సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్‌ను పరిశీలిస్తూ చెక్-ఇన్ హాల్, ఆధునిక సదుపాయాలు, విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్ అభివృద్ధి ప్రణాళికలపై జీఎంఆర్ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా రికార్డు స్థాయిలో 13,500 మంది కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రధాని మోదీ ఓపెన్‌టాప్ వాహనంలో వీక్షించారు.
Fact-Checked by Krihaa Editorial

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ప్రధాని సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్‌ను పరిశీలిస్తూ చెక్-ఇన్ హాల్, ఆధునిక సదుపాయాలు, విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్ అభివృద్ధి ప్రణాళికలపై జీఎంఆర్ ప్రతినిధుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా రికార్డు స్థాయిలో 13,500 మంది కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రధాని మోదీ ఓపెన్‌టాప్ వాహనంలో వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొబ్బిలి వీణను జ్ఞాపికగా అందజేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవడంతో పాటు, పర్యాటకం, పరిశ్రమలు, పెట్టుబడులు మరియు అంతర్జాతీయ అనుసంధానానికి కొత్త అవకాశాలను తెరవనుందని ప్రభుత్వం భావిస్తోంది.

Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

ప్రచురణ

క్రిహా న్యూస్ — హైదరాబాద్, తెలంగాణ

క్రిహా న్యూస్ ఖచ్చితమైన, స్వతంత్ర వార్తా విశ్లేషణకు కట్టుబడి ఉంది. మా ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ మరియు సవరణల విధానం చూడండి.

ప్రాయోజిత సమాచారం / Sponsored