Home/Politics/Pawan Kalyan Flags Off Kumki Elephants to Parvathipuram

పార్వతీపురానికి కుంకీ ఏనుగులను సాగనంపిన పవన్ కళ్యాణ్

Jul 24, 2026
Updated August 29, 2026
3 min read
Pawan Kalyan Flags Off Kumki Elephants to Parvathipuram - Politics News | Krihaa
Size:
Key Highlights
  • 1పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.
  • 2గజరాజులకు పూలు చల్లి, స్వయంగా ఆహారం అందించి, జెండా ఊపి గుచ్చిమి శిబిరానికి సాగనంపారు.
  • 3ప్రయాణంలో పూర్తి భద్రత కల్పించాలని, కొత్త ప్రాంతానికి అలవాటు పడేలా నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి తరచూ అడవి ఏనుగులు పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.
Fact-Checked by Krihaa Editorial

పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. గజరాజులకు పూలు చల్లి, స్వయంగా ఆహారం అందించి, జెండా ఊపి గుచ్చిమి శిబిరానికి సాగనంపారు. ప్రయాణంలో పూర్తి భద్రత కల్పించాలని, కొత్త ప్రాంతానికి అలవాటు పడేలా నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి తరచూ అడవి ఏనుగులు పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. మానవ-ఏనుగు ఘర్షణలను తగ్గించడంలో జయంత్, అభిమన్యుల సేవలు కీలకంగా మారనున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో అడవి ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించే అనేక ఆపరేషన్లలో ఈ రెండు కుంకీ ఏనుగులు విజయవంతంగా సేవలందించాయని అధికారులు వెల్లడించారు.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.