Home/Movies/Nuvve Nuvve Set for Worldwide Re-Release on September 4

సెప్టెంబర్ 4న రీ-రిలీజ్‌కు ‘నువ్వే నువ్వే’

Aug 15, 2026
Updated August 29, 2026
4 min read
Nuvve Nuvve Set for Worldwide Re-Release on September 4 - Movies News | Krihaa
Size:
Key Highlights
  • 1తరుణ్, శ్రియ జంటగా నటించిన ‘నువ్వే నువ్వే’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది.
  • 2లో విడుదలైన ఈ సినిమాతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమై ఘన విజయాన్ని అందుకున్నారు.
  • 3తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న రీ-రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Fact-Checked by Krihaa Editorial

తరుణ్, శ్రియ జంటగా నటించిన ‘నువ్వే నువ్వే’ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రాల్లో ఒకటి. 2002లో విడుదలైన ఈ సినిమాతో అప్పటివరకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రం తరుణ్, శ్రియ, త్రివిక్రమ్‌లకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ఎస్. రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పాత హిట్ సినిమాల రీ-రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ‘నువ్వే నువ్వే’ను కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈసారి థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

Krihaa News Logo

Read Faster on Krihaa News App

Instant breaking news alerts, offline reading & Tollywood updates in Telugu & English.

GET IT ON
Google Play
Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

Published by

Krihaa News — Hyderabad, Telangana

Krihaa News is committed to accurate, independent reporting. Read our editorial guidelines and corrections policy.