హోమ్/రాజకీయాలు/బ్రహ్మోత్సవాలకు ముందు 40 రోజులు మూసివేయనున్న శ్రీవారి పుష్కరిణి
రాజకీయాలుRead in English

బ్రహ్మోత్సవాలకు ముందు 40 రోజులు మూసివేయనున్న శ్రీవారి పుష్కరిణి

Jul 30, 2026
Updated August 29, 2026
4 min read
TTD to Close Srivari Pushkarini for 40 Days Ahead of Brahmotsavam - Politics News | Krihaa
Size:
Key Highlights
  • 1తిరుమల శ్రీవారి ఆలయం ఉత్తర భాగంలో ఉన్న పవిత్ర స్వామి పుష్కరిణిలో ఆగస్టు 1 నుంచి వార్షిక మరమ్మతు పనులు ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
  • 2ప్రతి ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు చేపట్టే సంప్రదాయ మరమ్మతుల్లో భాగంగా టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు నెలంతా పనులు కొనసాగనున్నాయి.భారీ వర్షాలు, తుఫాన్లను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు కూడా పుష్కరిణిని మూసివేయనున్నారు.
  • 3దీంతో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణిలో భక్తులకు స్నానం అనుమతించరు.
Fact-Checked by Krihaa Editorial

తిరుమల శ్రీవారి ఆలయం ఉత్తర భాగంలో ఉన్న పవిత్ర స్వామి పుష్కరిణిలో ఆగస్టు 1 నుంచి వార్షిక మరమ్మతు పనులు ప్రారంభించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతి ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు చేపట్టే సంప్రదాయ మరమ్మతుల్లో భాగంగా టీటీడీ వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ఆగస్టు నెలంతా పనులు కొనసాగనున్నాయి.

భారీ వర్షాలు, తుఫాన్లను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు కూడా పుష్కరిణిని మూసివేయనున్నారు. దీంతో ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు పుష్కరిణిలో భక్తులకు స్నానం అనుమతించరు. అలాగే పుష్కరిణి హారతి కూడా రద్దు కానుంది. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందే అన్ని పనులను పూర్తి చేసి పుష్కరిణిని తిరిగి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

ప్రచురణ

క్రిహా న్యూస్ — హైదరాబాద్, తెలంగాణ

క్రిహా న్యూస్ ఖచ్చితమైన, స్వతంత్ర వార్తా విశ్లేషణకు కట్టుబడి ఉంది. మా ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ మరియు సవరణల విధానం చూడండి.