హోమ్/ఓటీటీ/‘మైఖేల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం
ఓటీటీRead in English

‘మైఖేల్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధం

Jul 30, 2026
Updated August 29, 2026
3 min read
Michael OTT Release Date Locked: Michael Jackson Biopic Heads to JioHotstar - TV/OTT News | Krihaa
Size:
Key Highlights
  • 1ప్రపంచ ప్రఖ్యాత పాప్ సంగీత దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్’ థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • 2ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, సుమారు రూ.9,500 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో తొలి బిలియన్ డాలర్ హాలీవుడ్ బయోపిక్‌గా చరిత్ర సృష్టించింది.
  • 3సంగీతం, డ్యాన్స్, భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించి, ఆయన హావభావాలు, మూన్‌వాక్, స్టేజ్ ప్రెజెన్స్‌ను అచ్చం మైఖేల్‌లాగే ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నాడు.
Fact-Checked by Krihaa Editorial

ప్రపంచ ప్రఖ్యాత పాప్ సంగీత దిగ్గజం మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా రూపొందిన హాలీవుడ్ బయోపిక్ ‘మైఖేల్’ థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, సుమారు రూ.9,500 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో తొలి బిలియన్ డాలర్ హాలీవుడ్ బయోపిక్‌గా చరిత్ర సృష్టించింది. సంగీతం, డ్యాన్స్, భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించి, ఆయన హావభావాలు, మూన్‌వాక్, స్టేజ్ ప్రెజెన్స్‌ను అచ్చం మైఖేల్‌లాగే ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నాడు. జో జాక్సన్ పాత్రలో కోల్‌మన్ డొమింగో, కేథరిన్ జాక్సన్ పాత్రలో నియా లాంగ్ నటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, బుక్ మై షో స్ట్రీమ్‌లో రెంటల్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం, ఆగస్టు 29 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇంగ్లీష్, హిందీ భాషల్లో అదనపు రెంటల్ ఛార్జీలు లేకుండా స్ట్రీమింగ్ కానుంది.

Share:

Comments (0)

Join the conversation

Sign in to post comments, like, and reply

ప్రచురణ

క్రిహా న్యూస్ — హైదరాబాద్, తెలంగాణ

క్రిహా న్యూస్ ఖచ్చితమైన, స్వతంత్ర వార్తా విశ్లేషణకు కట్టుబడి ఉంది. మా ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ మరియు సవరణల విధానం చూడండి.